కార్పొరేట్ కంపెనీ బాస్‌లు ఉద్యోగులతో ఎప్పుడూ కఠినంగా ఉంటారనే అపవాదు ఉంది. కానీ బిలియనీర్, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా (Zerodha) సీఈఓ నితిన్ కామత్ తన కంపెనీ ఉద్యోగితో పందెం కాసి ఏకంగా రూ. 2.5 లక్షలు ఓడిపోయారు! ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పంచుకున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ఆయన తీసుకుంటున్న కేర్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.
ఆరు నెలల క్రితం తన టీమ్‌లోని ఒక ఉద్యోగితో బరువు తగ్గే (వెయిట్ లాస్) ఛాలెంజ్ చేశానని, నిర్దేశించిన టార్గెట్‌ను ఆ ఉద్యోగి విజయవంతంగా చేరుకోవడంతో సంతోషంగా రూ. 2.5 లక్షలు ప్రైజ్ మనీగా ఇచ్చానని ఆయన చెప్పారు. “ఇలా ఓడిపోవడం నాకు ఎంతో ఇష్టం, మా టీమ్ ఫిట్‌గా ఉండటమే నాకు కావాల్సింది” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎంతో మంది యువతకు ఈ పోస్ట్ ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది.

