Hot Topics

న్యూయార్క్ బోర్డింగ్ స్కూల్ దారుణం

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఒక ప్రముఖ బోర్డింగ్ స్కూల్‌కు సంబంధించిన నరకం లాంటి భయంకరమైన నిజాలు బయటపడి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి. ఆ పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారి విద్యార్థులపై అక్కడి యాజమాన్యం మరియు సిబ్బంది క్రూరమైన ఆకృత్యాలకు పాల్పడినట్లు అధికారిక దర్యాప్తులో తేలింది. చిన్నారి విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, శిక్షల పేరిట వారి చేత బలవంతంగా సమాధులు తవ్వించడం వంటి వింతైన, అమానవీయమైన పనులు చేయించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అంతటితో ఆగకుండా, తప్పు చేశారనే నెపంతో విద్యార్థులను శారీరకంగా తీవ్రంగా హింసిస్తూ, వారి వాంతులను వారికే తినిపించేలా బలవంతం చేశారనే షాకింగ్ నిజాలు పోలీసుల విచారణలో వెలుగుచూశాయి. పిల్లల హక్కులను కాలరాస్తూ, వారిని మానసికంగా కుంగదీసిన ఈ అమానవీయ ఘటనపై ప్రస్తుతం అమెరికా అంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యెక్తం అవుతున్నాయి. ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ ఇంటర్నెట్‌లో అత్యంత వేగంగా వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను కలచివేస్తోంది.

Tags :

AA News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent News