గత కొంతకాలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలను వణికిస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు ముగింపు పలికే దిశగా అడుగులు పడ్డాయి. అమెరికా-ఇరాన్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందంతో, ఇరాన్ తన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరుస్తుండగా, దానికి ప్రతిగా అమెరికా తన నావల్ బ్లాకేడ్‌ను ఎత్తివేసింది. పాకిస్థాన్, ఖతార్ ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్‌లో ఈ కీలక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.
ఈ వార్త బయటకు రాగానే ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత దిగివస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్న భయాల నుంచి ప్రపంచ దేశాలకు ఈ ఒప్పందం ఒక గొప్ప రిలీఫ్ అని చెప్పాలి.

