సాధారణంగా ఫౌల్ చేస్తే లేదా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆడితే ఫుట్‌బాల్‌లో రిఫరీలు రెడ్ కార్డ్ ఇస్తుంటారు. కానీ, వరల్డ్ కప్ 2026లో పరాగ్వే – టర్కీ మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ సందర్భంగా టర్కీ ఆటగాడితో వాగ్వాదానికి దిగిన పరాగ్వే మిడ్‌ఫీల్డర్ మిగ్యుల్ అల్మిరాన్ (Miguel Almiron) మాట్లాడుతూ తన చేతితో నోరు కవర్ చేసుకున్నాడు. దీనిని గమనించిన రిఫరీ వెంటనే అతనికి డైరెక్ట్ ‘రెడ్ కార్డ్’ ఇచ్చి గ్రౌండ్ నుంచి పంపించేశాడు!
ఫిఫా ప్రవేశపెట్టిన ఈ కొత్త రూల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్లు మైదానంలో ఏమనుకుంటున్నారో కెమెరాలకు, రిఫరీలకు స్పష్టంగా తెలియాలనే ఉద్దేశ్యంతో నోరు కవర్ చేసుకోకూడదని ఫిఫా ఈ కొత్త రూల్ పెట్టింది. అయితే, దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది మరీ టూమచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఈ మ్యాచ్‌లో పరాగ్వే 1-0 తో గెలిచింది).

