Hot Topics

లండన్ రాజకీయాల్లో ప్రకంపనలు?

బ్రిటన్ రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇటీవల జరిగిన మేకర్‌ఫీల్డ్ నియోజకవర్గ ఉపఎన్నికలో లేబర్ పార్టీకి చెందిన ప్రముఖ నేత ఆండీ బర్న్‌హామ్ భారీ విజయం సాధించడంతో, లండన్ ప్రధానమంత్రి అధికారిక నివాసమైన ’10 డౌనింగ్ స్ట్రీట్’ లో ఒక్కసారిగా రాజకీయ అలజడి మొదలైంది. బర్న్‌హామ్ సాధించిన ఈ ఏకపక్ష విజయం వల్ల పార్టీలో ఆయనకు మద్దతుదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆయన త్వరలోనే బ్రిటన్ తదుపరి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారంటూ లండన్ ఇంటర్నల్ రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం నడుస్తోంది.

మరోవైపు, ప్రస్తుత బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రధాని పదవి నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. అయితే, లండన్ అధికారిక వర్గాలు ఈ వార్తలను ఖండించాయి, స్టార్మర్ ఇంకా తన బాధ్యతలపైనే పూర్తిగా దృష్టి పెట్టారని స్పష్టం చేశాయి. ఒకవైపు బర్న్‌హామ్ అనుచరులు నెక్స్ట్ లీడర్‌గా ఆయనను ప్రధాని కుర్చీపై కూర్చోబెట్టడానికి పావులు కదుపుతుండగా, స్టార్మర్ ఈ అంతర్గత రాజకీయ సంక్షోభం నుండి తన కుర్చీని ఎలా కాపాడుకుంటారనేది ఇప్పుడు బ్రిటన్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

Tags :

AA News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent News